భారత్ న్యూస్ విజయవాడ…టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించారు!

ఆంధ్రప్రదేశ్ : నిన్న విడుదలైన టెట్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. ఏకంగా 150కి 150 మార్కులు సాధించారు. నంద్యాల జిల్లా గొర్విమానుపల్లెకు చెందిన మంజూల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతి కుమార్, విజయనగరానికి చెందిన కొండ్రు అశ్విని టెట్ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించారు. టెట్‌లో వంద శాతం మార్కులు సాధించడంపై వీరి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. టీచర్ ఉద్యోగం సాధించి ఉత్తమ బోధన అందించడమే తమ లక్ష్యమని వారు అన్నారు.