..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ‘దీపం 2.0’ పథకం..
తప్పని ఈ-కేవైసీ తిప్పలు
*అమరావతి :
ఏపీలో దీపం 2.0 కింద వంట గ్యాస్ రాయితీ పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి అని గ్యాస్ డీలర్లు చెప్తున్నారు. దీంతో లబ్ధిదారులు పెద్దఎత్తున గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తుండటంతో రద్దీ తలెత్తుతోంది.
గతంలో సిలిండర్ డెలివరీ సమయం లో ఈ- కేవైసీ తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చిందని ఆ విధానం అమలయ్యేలా చూడాలని లబ్దిదారులు కోరుతున్నారు.
గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో అయినా ఈ-కేవైసీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.