భారత్ న్యూస్ విజయవాడ,,,మచిలీపట్నం
10/10/2024
మహిమాన్వితంగా చెప్పబడే గోమాతను జాతీయ మాతగా గౌరవించి గుర్తించాలి…..
జ్యోతిర్మట్ ఉత్తరాఖండ్ పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య శ్రీ
అవి ముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ వారు గో ప్రతిష్ట ఆందోళన కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడ లోని శ్రీ శృంగేరి శారదా పీఠ మహా సంస్థాన పరి పాల్య మాన శ్రీ శివరామ క్షేత్రము (రామకోటి) ప్రాంగణానికి గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి అనే డిమాండ్ తో చేస్తున్న యాత్రలో భాగంగా విచ్చేస్తున్నందున మచిలీపట్నం నుండి యాత్ర నిర్వహణ కమిటీ తరఫున విజయవాడకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు….
ఈ సందర్భంగా అవి ముక్తేశ్వరానంద సరస్వతి వారు చేసే యాత్ర నిర్వహణ కమిటీ సభ్యుడు, పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ…..
సనాతన ధర్మంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఇతర ధర్మ శాస్త్రాలలో గోమాతను మహిమాన్వితంగా చెప్పటం జరిగింది అన్నారు.
గోమాతను ఒక ప్రాణిగా కాకుండా తల్లిగా గౌరవిస్తారు అన్నారు. ఇది సనాతన హిందువుల పవిత్రమైన విశ్వాసం అన్నారు.
గోమాతను జాతీయ మాతగా గౌరవించి గుర్తించాలి అనే డిమాండ్ తో పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి వారు గో ప్రతిష్ట ఆందోళన, గో ద్వజ్ స్థాపన భారత్ యాత్ర 2024 పేరుతో దేశవ్యాప్త పర్యటన చేస్తున్నారని తెలిపారు.
స్వామీజీ వారు భారతదేశంలోని 37 రాష్ట్రాల రాజధానుల లో గో ద్వజాన్ని పూజ్య స్వామీజీ వారు స్థాపించనున్నారు అని, ఇందులో భాగంగా మన అమరావతి రాజధాని విజయవాడ ప్రాంతానికి స్వామీజీ వారు రావడం జరుగుతోంది అన్నారు.
స్వామీజీ వారు గోమాత యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి వారి అనుగ్రహ భాషణంతో వివరిస్తూ
యాత్రను ముందుకు సాగిస్తున్నారు అన్నారు.
యాత్ర ముగింపులో స్వామీజీ వారు ఢిల్లీలో గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి అని డిమాండ్ చేస్తూ దేశ ప్రధానమంత్రి కి, రాష్ట్రపతికి స్వామీజీ వారు వినతి పత్రం అందజేయడం కూడా జరుగుతుంది అన్నారు.
స్వామీజీ వారి గో ప్రతిష్ట ఆందోళన కార్యక్రమం న కు మచిలీపట్నం నుండి విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫణికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గో ప్రేమికులు, వేమూరి రామకృష్ణారావు, మోపర్తి సుబ్రమణ్యం, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, సురిశెట్టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.