భారత్ న్యూస్ విజయవాడ…మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్
AP: గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది.
దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తిరుపతి-సికింద్రాబాబ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి.
స్పందించిన అధికారులు వెంటనే రైలును వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్లో నిలిపివేశారు.
అప్పికట్ల స్టేషన్ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్ రైలు సికింద్రాబాద్ బయల్దేరింది….