భారత్ న్యూస్ విజయవాడ…ప్రజల త్రాగునీరు…. రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
సమస్యలపై ఎమ్మెల్యే రామును కలిసిన….పలు గ్రామాల ప్రజలు
సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే రాము….
గుడివాడ21: గుడివాడ నియోజకవర్గంలో ప్రజల త్రాగునీటి…. రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
గుడివాడ రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో….. ఎమ్మెల్యే రాము సోమవారం ఉదయం ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు.
గుడివాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన…. ప్రజానీకం తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని…. తనను కలిసిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు.
గుడ్లవల్లేరు మండల పరిధిలోని నక్కవానిపాలెం…. చింతలకుంట గ్రామాల్లో రోడ్ల సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు….. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీరాజ్ అధికారులకు ఫోన్లు చేసి రోడ్ల సమస్య పరిష్కారానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.
గుడివాడ రూరల్ మండలం లింగవరం గూడెంలో నివాసాలు లేని చోట అధికారులు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని….. కూటమి నాయకులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా…. ప్రజలకు సమస్య ఉన్నచోటే మొదట ప్రాధాన్యతగ రోడ్లు వేయ్యాలని మండల పరిషత్ అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు.
ప్రజా శ్రేయస్సే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కూటమి నాయకులు…..ఆయా గ్రామాల పెద్దలు, ప్రజలు ఎమ్మెల్యే రామును కలిసిన వారిలో ఉన్నారు.