పాకాల గ్రంథాలయంలో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు విధులు గురించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యయన తరగతులు-2

పాకాల( భారత్ న్యూస్ ) ప్రారంభమైనది
భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు, విధులు అనే అంశం పైన ఈరోజు వక్తలు ఆర్ ఆనంద్ గారు ప్రసంగించారు . భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతూ సమానత్వ హక్కు స్వాతంత్రపు హక్కు దోపిడీని నివారించే హక్కు మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక మరియు విద్యాహక్కు, ఆస్తి హక్కు ఇలా హక్కుల పైన మంచి విషయాలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి వివరించారు. ఎన్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ హక్కుతో పాటు బాధ్యతలను కూడా పాటించాలని భారతీయులందరినీ కూడా కోరారు జాతీయ జెండాను ఏ విధంగా గౌరవించడం జాతీయ గీతాన్ని ఏ విధంగా మనం గౌరవిస్తున్నాం అదేవిధంగా జాతీయత పోరాటాన్ని హక్కుతో పాటు బాధ్యతను కూడా ఉండాలని గుర్తు చేశారు దేశాన్ని ఏ విధంగా సంరక్షిస్తూ జాతీయ రక్షణకు ఏ విధంగా మనం తోడ్పడాలి అనే విషయాన్ని తెలిపారు గ్రంథాలయ అధికారి రవీంద్రబాబు చైతన్య దయానంద బాబు ఏడుకొండలు రమేష్ మిగతావారు పాల్గొన్నారు