భారత్ న్యూస్ అమరావతి.ఇటీవల వరదలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావమే చూపాయి. ఆ సమయంలో వరద నిర్వహణ, త్వరితగతిన సాయం అందించేందుకు స్టార్ట్‌పలు ఎంతగానో ఉపయోగపడ్డాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘సా ్టర్టప్‌ ఆంధ్ర అనేది నినాదం కాదు.. పరిపాలనా విధానాన్ని మార్చేసే ప్రక్రియ..’ అని ఆయ న ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. వరద సహాయక చర్యల్లో స్టార్ట్‌పలు, డీప్‌-టెక్‌ సాంకేతికతను ఏ విధంగా వినియోగించుకున్నామో వివరిస్తూ ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో ఓ కథనాన్ని పోస్ట్‌ చేశారు. ఇటీవల వరదలతో ఇబ్బంది పడుతున్నప్పుడు రియల్‌ టైమ్‌లో సమస్యలు పరిష్కారానికి మార్గాలు అందించే స్టార్ట్‌పలను ఆహ్వానించామని చెప్పారు. ఈ క్రమంలో సమస్యలను రికార్డు సమయంలోనే పరిష్కరించే స్టార్ట్‌పల సామర్థ్యాన్ని చూసి తామే ఆశ్చర్యపోయామని మంత్రి తెలిపారు..