..భారత్ న్యూస్ అమరావతి..2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం
ధ్రువీకరించి లేఖ పంపించిన IOA
2036 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ గేమ్స్ ను భారత్లో
నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ కు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది.
ఈ లేఖను Oct 1న పంపినట్టు తెలిసింది.
గతంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2036లో ఒలింపిక్స్ నిర్వహణ పై భారత ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే..