భారత్ న్యూస్ విజయవాడ,,RBI వడ్డీ రేట్లు యథాతథం
ఈ త్రైమాసికానికి సంబంధించి RBI కీలక వడ్డీ రేట్లను వెల్లడించింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను RBI గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు తెలిపారు. రెపో రేటు 6.5 శాతం వద్ద కొనసాగించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి.