భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

ఏపీలో నూతన సంవత్సర కానుకగా జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు
తెలుస్తోంది.

కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది.ప్రస్తుతం ఉన్న కార్డులను రీడిజైన్ చేసి పాత, కొత్త లబ్ధిదారులు అందరికీ సరికొత్త డిజైన్ తో రేషన్ కార్డులను అందజేయనుంది.

పౌరసరఫరాల అధికారులు కొత్త రేషన్ కార్డుల కోసం కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి.