..భారత్ న్యూస్ అమరావతి..ఈ నెల 7 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 7 నుంచి 11 వరకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.