.భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి 4 రోజులు వర్షాలు..!!
నాలుగు రాష్ర్టాలపై అల్పపీడన ప్రభావం
హైదరాబాద్, నవంబర్ 7: నైరుతి బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్పపీడన ప్రభావంతో నవంబర్ 7 నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్‌లో సాధారణం కంటే ఎకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.