..భారత్ న్యూస్ అమరావతి..వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి?
విజయవాడ అక్టోబర్ 25 ప్రజా రక్ష
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు TDP అధిష్ఠానం MLC పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
గత రెండు ఎన్నికల్లో రాధాకు పోటీ చేసే అవకాశం దక్కలేదు.
కొన్నేళ్లుగా ఆయన టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది.ఇటీవల రాధా ఇంటికి నారా లోకేశ్ వెళ్లడంతో ఆయనకు MLC పదవి కన్ఫార్మ్ అయిందనే వార్తలకు బలం చేకూర్చుతోంది.