Ammiraju Udaya Shankar.sharma News Editor…Amaravati…Chandrababu : శాంతిభద్రతలపై రాజీపడొద్దు
పోలీసులకు అన్ని విధాలా అండగా ఉంటాం
ఆడబిడ్డలపై అత్యాచారాలకు
పాల్పడే వారికి శిక్షలు కఠినంగా ఉండాలి
గత ప్రభుత్వం పోలీసుల స్థాయిని దిగజార్చింది
ఆ ప్రభుత్వం పెట్టిన రూ. 763 కోట్ల
బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం
పోలీసు సంక్షేమానికి ఏటా రూ.20 కోట్లు ఇస్తాం: సీఎం
శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడొద్దు. పోలీసు శాఖకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఆడబిడ్డలపై గంజాయి మత్తులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారికి అదే చివరి రోజు కావాలి. హిందూపురం, బద్వేలు, బాపట్లలో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారికి ప్రత్యేక కోర్టుల ద్వారా కఠిన శిక్షలు పడేందుకు కృషిచేయాలి’ అని పోలీసు శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ జీరోకు రావాలని, డ్రగ్స్‌, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడాలని చెప్పారు.Ammiraju Udaya Shankar.sharma News Editor…Amaravati