.భారత్ న్యూస్ అమరావతి.ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట…
షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం…
చదువురాని పొలం యజమానిని నమ్మించి 40 సెంట్లు పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియలస్టేట్ మీడియేటర్ షేక్ నాగులు…
సంవత్సరం క్రితం రియలస్టేట్ మీడియేటర్ షేక్ నాగులు ద్వారా షేర్ మొహమ్మద్ పేట గ్రామానికి చెందిన చిట్టిప్రోలు సుధాకర్ కి ఎకరం పొలాన్ని 25 లక్షలకు అమ్మిన పొలం యజమాని షేక్ ముస్తఫా….
ఇదే అదునుగా భావించి చిట్టిప్రోలు సుధాకర్ కి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించే టైమ్ లో తన పేరమీద 40 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియలస్టేట్ మీడియేటర్ షేక్ నాగులు..
నాకు చదువు రాకపోవడంతో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టానంటున్న షేక్ ముస్తఫా..
నాకు రైతు బంధు పడటం లేదని బ్యాంకు వారిని వెళ్లి అడిగిన షేక్ ముస్తఫా…
అడంగుల 1బి తెచ్చుకోమన్న బ్యాంకు మేనేజర్…
మీసేవాలో అడంగుల 1బి తీసుకోగా షేక్ నాగులు పేరు ఉండటంతో అవాక్కయిన షేక్ ముస్తఫా..
చిట్టిప్రోలు సుధాకర్ కి ఎకరం పోలం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దాంట్లో 40 సెంట్లకు కూడా షేక్ నాగులు పేరు మీద దొంగ కాగితాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోతున్న బాధితులు..
నాకు చదువు రాదని తెలిసి కావాలనే చిట్టిప్రోలు సుధాకర్, షేక్ నాగులు లు మమ్మల్ని మోసం చేసారని వాపోతున్న బాధితులు…
దయచేసి నాపొలం నాకు ఇప్పించాలని , ఇప్పించచకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటున్న బాధితులు…..