భారత్ న్యూస్ విజయవాడ…ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ -ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి..
రాజమండ్రి, నవంబర్ 6: తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే ) జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి, ఎం.శ్రీరామమూర్తి, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె . పార్థసారధిలు జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతిని కలిసి ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ 50% కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల కోరడం జరిగింది. వారి వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి బుధవారం ఇందుకు సంబంధించిన సర్కులర్ జారీ చేశారు. 2024-2025 విద్యా సంవత్సరంలో ఈ ఉత్తర్వులు అమలయ్యేలా జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ సర్కులర్ లో జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జిల్లా కలెక్టర్ శ్రీమతికి ప్రశాంతికి గారికి ఏపీయూడబ్ల్యూజే, డి రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున ఎం శ్రీరామమూర్తి, కె పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు… ఈ విషయం జర్నలిస్టు మిత్రులకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు..