..భారత్ న్యూస్ అమరావతి..అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
Oct 20, 2024,
అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని అన్నారు. లంచం తీసుకునే వాళ్లు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదన్నారు.