..భారత్ న్యూస్ అమరావతి..పవన్ ఉంటే చాలు.. బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ అదరహో!

పవన్ ఉంటే చాలు.. బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ అదరహో!
ఏపీలో సొంత బీజేపీ నేతల కంటే జనసేన నేత పవన్ కల్యాణ్‌నే కేంద్ర బీజేపీ నేతలు ఇష్టపడుతున్నారు. ఆయననే గట్టిగా నమ్ముకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్. అంతే కాదు ఆయన రాజకీయంగా కూడా బీజేపీ భావజాలానికి దగ్గర అవుతున్నారు. ఏపీలో తాము ఎప్పటికైనా జెండా పాతాలి అంటే అది పవన్ లాంటి సునామీతో జత కట్టడం వల్లనే సాధ్యమని బీజేపీ పెద్దలు గాఢంగా విశ్వ‌సిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే పవ‌న్‌ని బీజేపీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంద‌ని టాక్‌.