..భారత్ న్యూస్ అమరావతి..పట్నా పైరేట్స్ సూపర్ షో
ప్రొ కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ వరుసగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా 42-37 పాయింట్ల తేడాతో యూపీ యోధా టీమ్‌పై జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే పట్నా ఆధిపత్యం చెలాయించింది. యూపీ కూడా గట్టి పోటీ ఇచ్చినా విజయం మాత్రం సాధించలేకపోయింది.