అప్రమత్తమైన అధికారులు,స్థానికుల సహాయంతో దామరచెరువు ఆనకట్ట గేటు మరమ్మత్తులు…..పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి
పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ పరిధిలోని దామలచెరువు ఆనకట్ట గేట్ విరిగిపోయినట్టు సమాచారం రావడంతో వెంటనే స్పందించి పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,ఎంపీడీఓ శశికళ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పలు చెరువులలో వర్షపు నీరు చేరాయి.ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.సురేష్,ఈ.ఓ యుగంధర్ లు సంఘటన స్థలానికి చేరుకుని,స్థానికుల సహాయంతో గేట్ సరి చేపించారు.నీరు వృధా కాకుండా నిల్వ చేశారు.ఏమి ప్రమాదం జరగక పోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ఈకార్యక్రమంలో దామలచెరువు ఈ.ఓ యుగంధర్,టిడిపి నాయకులు రఘుపతి నాయుడు,చిన్నబ నాయుడు,కోటి,పురుషోత్తం నాయుడు,సచివాలయ సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.