టపాసుల దుకాణదారులు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి….పాకాల అగ్నిమాపక అధికారి బి.గుణశేఖర్ రెడ్డి

పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో టపాసుల దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోని నిర్వహించాలని పాకాల అగ్నిమాపక అధికారి బి.గుణశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి బి.గుణశేఖర్ రెడ్డి మాట్లాడుతూ లైసెన్స్ తీసుకోకుండా టపాసులు అమ్మిన,షాపులు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.దీపావళి సందర్భంగా టపాసు దుకాణాలు పెట్టాలంటే ప్రతి ఒక్కరూ ముందస్తుగా లైసెన్స్ తీసుకొని నిర్వహించాలని తెలిపారు.