..భారత్ న్యూస్ అమరావతి..పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు మృతి..
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు అనారోగ్యంతో మృతి చెందారు.
గుస్సాడీ నృత్యంలో విశేష ప్రతిభ చూపిన కనక రాజుకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 2021 నవంబర్ 9న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
నృత్య కళాకారుడు కనక రాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సంతాపం తెలిపారు.