భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఒక్క పందెం కోడి.. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది
భర్త, కుమారుల మృతిని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో కోడికి ఈత నేర్పడానికి వెళ్లి భర్త వెంకటేశ్వరరావు (45), కుమారులు మణికంఠ (15), సాయి కుమార్ (13) కాలువలో మునిగి చనిపోయారు.
అయితే భర్త, కుమారులు ఒకేసారి అకాల మరణంతో దూరం కావడాన్ని భార్య దేవి(36) భరించలేకపోయింది.. వారినే తలుచుకుంటూ తీవ్ర మానిసక వేదనకు గురైంది.
దీంతో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరుగుదొడ్డిలో ఇనుప రాడ్డుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది…