గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు
: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ చేతులమీదుగా ISO 9001:2015 సర్టిఫికేట్ తహసీల్దార్ కు అందజేత
(భారత్ న్యూస్ :గుంతకల్లు)
అనంతపురం, అక్టోబర్ 28 :
గుంతకల్లు మండల తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు లభించింది. గుంతకల్లు పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో సోమవారం గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ISO 9001:2015 సర్టిఫికేట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ చేతులమీదుగా తహసీల్దార్ రమాదేవికి అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ISO 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు లభించడం ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇందుకు బాగా పని చేసిన తహసిల్దార్ కార్యాలయం సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా అయినా ISO 9001:2015 సర్టిఫికేట్ ను పొందాలంటే 39 రకాల ప్రమాణాలు అవసరం అవుతుండగా, ఐఎస్ఓ ప్రతినిధులు వచ్చి అన్ని రకాల ప్రమాణాలు ఉన్నాయని హైదరాబాదులోని గ్లోబల్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు గుంతకల్లు తహసిల్దార్ కార్యాలయానికి ISO 9001:2015 సర్టిఫికేట్ ను అందించడం జరిగిందని తహసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ ఎబివిఎస్బి శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ నారాయణస్వామి, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ షేక్షావలి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.