భారత్ న్యూస్ విజయవాడ…టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ నేతలు..
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. దాడి జరిగిన రోజు ఉదయం వీరంతా ఎక్కడ ఉన్నారు? ఎక్కడెక్కడ కలిశారు? ఏయే ప్రాంతాల్లో సమావేశమయ్యారు? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇక ఈ కేసును ఇటీవల సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. కానీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా అప్పగింత ఆలస్యమైంది. దీంతో మంగళగిరి పోలీసులే విచారణను కొనసాగిస్తున్నారు. కాగా, వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ 19న ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు టీడీపీ ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు.