.భారత్ న్యూస్ అమరావతి..రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు. గత ఐదేళ్లపాటు ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోగా వాటిని పట్టాలెక్కించి పరిస్థితిని పూర్తిగా మార్చనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ఇవాళ (శనివారం) సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. రూ.160 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వంలో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆ పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ఈనెల 16న జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల పునఃప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.