బొమ్మయ్యకుంట వద్ద వ్యాయామశాలను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీలో శనివారం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి చేతుల మీదుగా,మాజీ ఎంపీపీ చాముండేశ్వరి,స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు.వీటితో పాకాల రూపు రేఖలు మారనున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులి వర్తి నాని అన్నారు.స్థానిక కూటమి పార్టీల నాయకులతో ప్రజా ప్రతినిధులతో కలిసి బొమ్మయ్యకుంట వద్ద నూతన వ్యాయామశాలను ప్రారంభించారు.గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకి పాకాల ఈ.ఓ మోతి,సర్పంచ్ కస్తూరి,స్థానిక నాయకులు,యువత మహిళలు గజమాలలతో సత్కరించి,శాలువాలు కప్పి అపూర్వ స్వాగతం పలికారు.రిబ్బన్ కత్తిరించి జిమ్మును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు.స్థానికంగా ఏర్పాటు చేసిన జిమ్మును అందరూ సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ‌్యాన్ని పెంచుకోవాలని సూచించారు.అనంతరం బొమ్మయ్యకుంట,సి.ఐ కార్యాలయం,భారతంమిట్ట 7వ క్రాస్ లో సుమారు 1 కోటి 17 లక్షల రూపాయలతో డ్రైనేజ్ కాలువలు,సిసి రోడ్లు వంటి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.పాకాల బజారు వీధిలోని చౌక దుకాణంలో లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులను ఎమ్మెల్యే నాని స్వయంగా పంపిణీ చేశారు.చౌక దుకాణ డీలర్లు ప్రజలకు ప్రభుత్వం అందించే అన్ని సరుకులను క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని ఇందులో ఏదైనా తేడా జరిగితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి పాకాల పట్టణ అధ్యక్షుడు డి.మోహన్ చౌదరి,లింగయ్య నాయుడు,డేవిడ్ సురేష్,బాలాజీ,రావెళ్ళ మోహన్,కనకరాజు,సావిత్రి,బాల శంకర్,ప్రవీణ్,మోహన్,స్థానిక కూటమి పార్టీల నాయకులు,అధికారులు,యువత,మహిళలు,పాల్గొన్నారు.