ఏలురు జిల్లా కైకలూరు::::24\10\2024:::: :-భారత్ న్యూస్:::ప్రజా శ్రేయస్సు,నియోజక అభివృద్ధి కోసం బి.జే.పి.పార్టీ లో జేరానన్న ఏం.పి.పి.అడివి కృష్ణ 23-10-2024 (బుధవారం) కైకలూరు వైఎస్ఆర్సిపి ఎంపీపీ అడవి కృష మరియు దొడ్డిపట్ల వైఎస్ఆర్సిపి సర్పంచ్ , మండల సర్పంచ్ సంఘాల అధ్యక్షుడు చెరుకువాడ బలరామరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నీ వీడి కైకలూరు శాసన సభ్యులు డా కామినేని శ్రీనివాస్ సమక్షంలో బిజెపి పార్టీ లో చేరారు. ఏం.ఎల్.ఎ.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అడివి కృష్ణ బి.జే.పి.పార్టీ లో ప్రధాన పాత్ర పోషించారని నాకు వున్న అత్యంత సన్నిహిత మిత్రులుఅని, 2019 వరకు పార్టీలో వున్నారని, తదుపరి వై.ఎస్.అర్. పార్టి లో చేరారని ఏం.పి.పి.గా పదవిలో ఉంటూ నియోజకవర్గంలో మొట్టమొదటిగా వై.సీ.పి.నీ వీడి బి.జే.పీ.పార్టీ లోకి రావటం శుభపరిణామమని అన్నారు,అనంతరం కమ్మిలి విఠల్,వేంపాటి విష్ణు సమక్షంలో కామినేని శ్రీనివాస్ చేతులమీదగా నాయకుల సమక్షంలో బి.జే.పి. కండువాని కప్పించుకొన్నారు.అడవి కృష్ణ ఏం.ఎల్.ఏ. కామినేనిశ్రీనివాస్ నీ,కమ్మిలి విఠల్ ని, వేంపాటి విష్ణుని పూలదండాలతోనూ,దుస్సాలువాతోనూ సత్కరించారు,అడవి కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి,నియోజకవర్గ అభివృద్ధి కోసం బిజెపి పార్టీలోకి వచ్చానని క్రమశిక్షణ నియమ నిబద్ధత కలిగిన పార్టీ అని మీడియా ద్వారా తెలియజేశారు