జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి తరలిరండి – తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి( భారత్ న్యూస్ )పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ” శ్రీ వై. యస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు అధ్యక్షులుగా శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఈ నెల 3వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షునిగా మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ భూమన కరుణాకరరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ గౌ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు,
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌ శ్రీ కె. విజయసాయి రెడ్డి గారు,
మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌ శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులు, గౌ” శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు,
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, గౌ” శ్రీ బొత్సా సత్యనారాయణ గారు,
మాజీ మంత్రివర్యులు గౌ” శ్రీ అంబటి రాంబాబు గారు,
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌ” శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమం వైఎస్సార్‌సీపీకి అత్యంత ముఖ్యమైంది. జమిలి ఎన్నికల నేపథ్యంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైన్యాన్ని సమాయత్తం చేసుకోవాల్సిన ఆవశ్యకత
ఎంతైనా వుంది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ప్రముఖులు విచ్చేయుచున్నారు. కావున కరుణాకరరెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరై మన సత్తా ఏంటో చాటి, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసుకోవడం ద్వారా, భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే అని చాటి చెప్పాలని కోరుతున్నాను.
తిరుపతి-చిత్తూరు హైవే రహదారిపై (150 అడుగుల బైపాస్ రోడ్) నయారా పెట్రోల్ బంకు పక్కన హోటల్ సదరన్ స్పైస్ సమీపంలో నిర్వహించనున్న కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ సైనికులంతా తరలి రావాలని పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాను.
కావున పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, MPTC లు, ZPTC లు, మండల అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు, యువత మరియు మహిళా విభాగం నాయకులు తప్పక కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాము.
కార్యక్రమం అనంతరం భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి.