మధ్యాహ్నం భోజన కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలి…..సిఐటియు నాయకుడు మధుసూదన్ రావు డిమాండ్
పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల వివక్షతను చూపుతోందని,పెరిగిన నిత్యవసర వస్తువులకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని అన్నారు.కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు.స్కూలు ఆయాలకు కనీస వేతనం అమలు చేయాలని అన్నారు.పిఎఫ్,ఈఎస్ఐ,ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.క్యాజువల్ లీవులు ఇవ్వాలని నాలుగు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు.అలాగే కార్మికులకు ప్రతినెల 5వ తేదీన వేతనాలు వచ్చేలా చూడాలని కనీస వేతనం 26,000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రసాద్,సుగుణమ్మ,ధనమ్మ,రెడ్డన్న,మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.