..భారత్ న్యూస్ అమరావతి.త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!!

దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (RRB)లను మరింత సమర్థంగా నిర్వహణ, ఖర్చుల నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది.

దీంతో ప్రస్తుతం ఉన్న గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28 కి తగ్గనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో 5 గ్రామీణ బ్యాంకులున్నాయి..