పదిపుట్లబైలు పంచాయతీలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి

పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ కొండకిందపల్లిలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో శనివారం ప్రారంభించారు.ముందుగా లక్ష రూపాయలు కట్టి శాశ్వత సభ్యత్వంగా పులివర్తి సుధా రెడ్డి నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా టిడిపి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ
పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి . తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిడిపి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆదేశాల మేరకు అక్టోబర్ 26వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం శ్రేణులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తకి చేరవేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నూతన సభ్యత్వ విధానంలో సభ్యత్వం చేసుకున్న వారికి, 100 రూపాయలతో రెండు సంవత్సరాల సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా రూ.5 లక్షలు రూపాయలు కుటుంబ సభ్యుల అవసరాల కోసం ప్రమాద బీమా వస్తుందని . నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలకు అభిమానులకు సానుభూతిపరులకు పార్టీ సభ్యత్వ నమోదు పై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. టిడిపి సభ్యుల సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు భరోసా ఉంటుందని సుధా రెడ్డి తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు పాల్గొన్నారు.