..భారత్ న్యూస్ అమరావతి..: గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి….. పలువురు గో ప్రేమికుల డిమాండ్…..

ఉత్తరాఖండ్ జ్యోతిర్నఠ్ పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గో ప్రతిష్ట ఆందోళన, గో ద్వజ్ స్థాపన భారత యాత్ర- 2024 ఈనెల 10వ తేదీన విజయవాడ నగరంలో జరగనున్నట్లు యాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య , మచిలీపట్నం వాసుదేవ గోశాల నిర్వహకులు, పల్లపాటి సుబ్రమణ్యం , యాత్ర జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు, పి. వి. ఫణి కుమార్ లు తెలిపారు…

మచిలీపట్నంలో బుధవారం వాసుదేవ గోశాల నిర్వాహకుడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం కార్యాలయంలో, వాసుదేవ గోశాల నిర్వాహకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం,యాత్ర కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు, పి. వి. ఫణి కుమార్ తదితరులు యాత్రకు సంబంధించిన గోడప్రతులను,కరపత్రాలను ఆవిష్కరించారు…

ఈ సందర్భంగా వాసుదేవ గోశాల నిర్వాహకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం, యాత్ర కార్యనిర్వాహన కమిటీ సభ్యుడు, పి. వి. ఫణి కుమార్ లు మీడియాతో మాట్లాడుతూ…..

గోవును దేశమాతగా , రాష్ట్ర మాతగా గుర్తించాలని అవిముక్తేశ్వరానంద సరస్వతి దేశ వ్యాప్త యాత్ర చేపట్టారు ..

యాత్రకు స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించింది అన్నారు..

అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ,

ఈనెల10 వ తేదీన అనగా గురువారం తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి యాత్ర చేరుకుంటుందని,

యాత్ర విజయవాడ
వచ్చే సందర్బంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎమ్మెల్యేలు, గో ప్రేమికులు, హిందూ బంధువులు అందరూ స్వామివారికి స్వాగతం పలుకుతారని పల్లపాటి సుబ్రహ్మణ్యం, పి. వి. ఫణి కుమార్ లు తెలిపారు..

10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో విజయవాడలోని సత్యనారాయణపురం శివరామ కృష్ణ క్షేత్రం ( రామకోటి) లో గోపూజ, గో ధ్వజ స్థాపన కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు, గో ప్రేమికులు అందరూ హాజరై గోమాతను జాతీయ మాతగా గుర్తించి గౌరవం ఇవ్వాలని స్వామీజీ చేపట్టిన యాత్రకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని అందరినీ పత్రికా ముఖంగా కోరడమైనది అని తెలిపారు.

భారతదేశంలోని 37 రాష్ట్రాల రాజధానులలో శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ వారు గో ద్వజాన్ని పూజ్య స్వామీజీ వారు స్థాపించనున్నారు అని ఇందులో భాగంగా మనకు దగ్గరలో విజయవాడ నగరంలో ఈనెల 10వ తేదీన స్వామీజీ వారు విచ్చేసి గోమాతకు ప్రత్యేక విశిష్టత కలిగించేలా జాతీయ మాతగా గోమాతను గుర్తించాలి అనే డిమాండ్ కు స్వామీజీ వారు చేసే మహత్ సంకల్పానికి మనము అందరం మద్దతు తెలియజేయవలసి ఉన్నది కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…..

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వాసుదేవ గోశాల నిర్వాహకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం, స్వాగత కమిటీ సభ్యులు, పి. వి. ఫణి కుమార్ లతోపాటుగా, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, సురిశెట్టి హరికృష్ణ, బత్తిన అగస్తేశ్వర రావు, ఈడే భాస్కరరావు, వేముల బుజ్జి, మైనంపూడి వాసు, తదితరులు పాల్గొన్నారు.