భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్ర పదేశ్ లో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలకు సంబంధించి గత ప్రభుత్వ అవినీతి నుంచి ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి సంక్రమించిన వారసత్వ సమస్య అని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగును అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కొంత కాలం క్రితం విశాఖ ఓడరేవులో కొకైన్ స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు.
దేశంలోని ఇతరచోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు రాష్ట్రంతో సంబంధాలున్నాయని తెలిపారు.
నేరస్థుల కట్టడికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొ న్నారు.