భారత్ న్యూస్ అమరావతి..ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తోంది. ఉదాహరణకు ఈ నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాం:ప్రధాని మోదీ
ఇది 4300 మీటర్ల ఎత్తులో ఉంది.అందులో విశేషమేంటో తెలుసుకుందాం!
ఇది భారతదేశ తయారీ- ‘మేడ్ ఇన్ ఇండియా: ప్రధాని మోదీ
మైనస్ 30 డిగ్రీల చల్లటి వాతావరణం ఉన్న ప్రదేశంలో- ఆక్సిజన్ కొరత కూడా ఉన్న ప్రదేశంలో- మన శాస్త్రవేత్తలతో పాటు స్థానిక పరిశ్రమలు ఆసియాలో మరే దేశం చేయని పనిని చేశాయి.
హాన్లే టెలిస్కోప్ సుదూర ప్రపంచాన్ని చూస్తూ ఉండవచ్చు.
అది మనకు మరొక విషయాన్ని కూడా చూపుతోంది – అది స్వయం సమృద్ధ భారతదేశ సామర్థ్యం: ప్రధాని మోదీ