భారత్ న్యూస్ విజయవాడ,,,నిజమైన మానవతావాదిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

Oct 10, 2024,

నిజమైన మానవతావాదిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు
రతన్‌ టాటా మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తమదైన దృష్టితో ప్రపంచంపై ముద్రవేసిన కొందరు వ్యక్తుల్లో రతన్‌ టాటా ఒకరు. మనం ఒక వ్యాపారవేత్తనే కాదు.. నిజమైన మానవతావాదిని కోల్పోయాం. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, దాతృత్వశీలిగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రతన్‌ టాటాను అభిమానించేవారికి, టాటా గ్రూప్‌నకు తన ప్రగాఢ సానుభూతి’’ అని చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు