భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,విజయవాడలో లోకో పైలట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్: విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణం చోటు చేసుకుంది.

లోకోపైలట్ ఎబునైజర్(52)ను గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.

విధుల్లో ఉన్న లోకో పైలట్ తలపై నిందితుడు రాడ్డుతో కొట్టడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు.

ఆసుపత్రికి తరలించిన కాసేపటికే మరణించాడు.

CCTV విజువల్స్ ఆధారంగా నిందితుడు ఒంటిపై చొక్కా లేకుండా సంచరించినట్లు పోలీసులు గుర్తించారు.

అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.