కృష్ణాజిల్లా గుడివాడ 01\12\2024::: (భారత్ న్యూస్ ) కృష్ణ జ్యోతి డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము పుట్టినరోజును పురస్కరించుకుని కృష్ణజ్యోతి దినపత్రిక ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం అర్ధరాత్రి ఆవిష్కరించారు. కృష్ణ జ్యోతి బృందం ఎమ్మెల్యే రాముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా కృష్ణ జ్యోతి దినపత్రిక గుడివాడ పరిసర ప్రాంత పాఠకులకు అందిస్తున్న సేవలను అభినందించారు. పత్రికా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ అనేక ప్రత్యేక సంచికలను పాఠకులకు అందిస్తూ మన్ననలు అందుకుంటున్న కృష్ణ జ్యోతి యాజమాన్యాన్ని రాము ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కృష్ణజ్యోతి ఎడిటర్ ఇన్ చీఫ్ మత్తి శ్రీకాంత్, గుడివాడ ప్రెస్ క్లబ్ కోఆర్డినేటర్ పిల్లా శేఖర్, కృష్ణ జ్యోతి సిబ్బంది బి కిరణ్, సిర్ర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.