భారత్ న్యూస్ విజయవాడ…ఇప్పుడు జగన్‌ ఎమ్మెల్యేనే కదా.. కోర్టుకు రావడానికి ఇబ్బంది ఏమిటి

కోడికత్తి కేసులో శ్రీనివాస్‌ తరపు న్యాయవాది ప్రశ్న

విశాఖపట్నం, జగన్‌ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే కదా.. కోర్టులో విచారణకు హాజరుకావడానికి ఆయనకు ఇబ్బంది ఏమిటి..? అని కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది సలీం ప్రశ్నించారు. విశాఖపట్నం న్యాయస్థానంలో జరుగుతున్న ఈ కేసు విచారణకు జగన్‌ మరోసారి గైర్హాజరయ్యారు. దాంతో ఈ కేసును నవంబరు 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా కోర్టు బయటసలీం, దళిత సంఘం నాయకులు బూసి వెంకటరావు విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్‌ పరువు నష్టం కేసులో ప్రతి వాయిదాకూ విజయవాడ నుంచి విశాఖపట్నం కోర్టుకు వస్తున్నారని చెప్పారు. ఆయనకు లేని ఇబ్బంది జగన్‌కు ఏమిటని సలీం ప్రశ్నించారు.