శేషాపురంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమం ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇ-పాలగుట్టపల్లి పంచాయతీ శేషాపురం నుండి గుంతల రహిత రహదారుల కార్యక్రమంను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్,ఎమ్మెల్యే పులివర్తి నాని,పాకాల జడ్పిటిసి నంగా పద్మజా బాబురెడ్డి చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు.ముందుగా శేషాపురంకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు.చంద్రగిరి నియోజకవర్గంలో గుంతల రహిత రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు.కల్లూరు ఘాట్ రోడ్డు నుండి శేషాపురం వరకు గుంతల రహిత రహదారుల పనులకు భూమి పూజ నిర్వహించారు.రోడ్డు మరమ్మత్తుల కోసం సుమారు 6 కిలో మీటర్లకు గాను 4.50 లక్షల రూపాయలతో పనుల ప్రారంభించారు.చంద్రగిరి నియోజకవర్గంలో మొదట ఫేస్ లో సుమారు 11 వర్కులకు,గుంతల రహిత రహదారి సుమారు 87.63 కీలో మీటర్లుకు సుమారు 89.40 లక్షల రూపాయలతో మరమ్మతులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్,ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీకారం చుట్టారు.చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్ మరమ్మతులకు నిధులు సరిపోదు,కావున చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్ మరమ్మతులకు నిధులు విడుదల జాప్యం జరిగిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినారు.తిరుపతి జిల్లాలో అన్నీ నియోజకవర్గాల కంటే చంద్రగిరి నియోజకవర్గానికి నిధులు తక్కువగా కేటాయించారని పేర్కొన్నారు.చంద్రగిరి నియోజకవర్గనికి మరింత నిధులు కేటాయించి చంద్రగిరిని ఆదుకోవాలని పులివర్తి నాని జిల్లా కలెక్టర్ ను కోరారు.ముఖ్యంగా పాకాల మండలంలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.పలమనేరు నుండి ఏనుగులు వలస రావడంతో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి వాటి వలన త్రీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.రైతులు పండించే వరి,వేరుశనగ,మామిడి,టెంకయ చెట్లను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని అన్నారు.నష్టపోయిన రైతులకు నష్టరిహారం అందేలా చూడాలి అని జిల్లా కలెక్టర్ ను కోరారు.శేషాపురం గ్రామంలో సెల్ టవర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యను జిల్లా కలెక్టర్ కు తెలపడంతో వెంటనే స్పందించి సెల్ టవర్ సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడి ఎయిర్టెల్,బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు మరమ్మతులకు భూమి పూజ చేసి రోడ్ రోలర్ వాహనాన్ని నడిపిన జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజలను ఆశ్చర్యపరిచారు.దామలచెరువు-కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్ సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే పులివర్తి నాని తీసుకువచ్చారు.స్పందించి దామలచెరువు-కొమ్మిరెడ్డిగారిపల్లి వరకు రోడ్డు పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంభందించిన అధికారులకు ఆదేశాలు కలెక్టర్ జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశిరేఖ,తాసిల్దార్ నిత్యానంద బాబు,వివిధ శాఖల అధికారులు,టిడిపి మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు కార్యదర్శి పల్గుణ కుమార్,జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తలారి గురునాథ్,ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.