.భారత్ న్యూస్ అమరావతి..కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు

కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో రైతులు లోన్ పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు బీమా కూడా ఉంది.

రైతులు చనిపోయినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.50 వేల బీమా అందుతుంది. ప్రస్తుతం దీనిని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానం చేశారు. ఈ కార్డు కోసం స్థానిక బ్యాంకులలో సంప్రదించవచ్చు