..భారత్ న్యూస్ అమరావతి…తల్లి పాలు తాగడం జీవించే హక్కులో భాగం: కేరళ హై కోర్టు.

తల్లి నుండి బిడ్డను వేరు చేయడం అనే చర్య తల్లి పాలివ్వటానికి, బిడ్డకు తల్లిపాలు ఇచ్చే హక్కు
రెండింటినీ ఉల్లంఘించడమే అని కేరళ హైకోర్టు ఒక కేసులో అభిప్రాయ పడింది.

భారత రాజ్యాంగంలోనిఆర్టికల్ 21 ప్రకారం తల్లిపాలు తాగడం జీవించే హక్కులో భాగమని కోర్టు పేర్కొంది. తల్లి పిల్లలకు పాలివ్వడాన్ని స్పష్టంగా సమర్ధిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచాలని రాజ్యాంగం ఆదేశించిందని హైకోర్టు కూడా నొక్కి చెప్పింది.