భారత్ న్యూస్ విజయవాడ…నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి వారందరు త్వరగా కోలుకొనేటట్టు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కి సూచించడము జరిగింది.

పెద్దపల్లి కలెక్టర్ ఆసుపత్రిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారిని ఇంచార్జి పెట్టి బాలికలకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నాము.

బాలికల తల్లి తండ్రులకు ధైర్యము కలిగించి వారికి ఈ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ గారికి సూచించాను.

బాలికలు ఒకే సారి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను విచారిస్తున్నాము,పాఠశాల పక్కన గల డంపింగ్ యార్డ్ ను తక్షణమే అక్కడినుంచి తరలించాలని అధికారులను ఆదేశించడము జరిగింది.