భారత్ న్యూస్ విజయవాడ…తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా(CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును CJI జస్టిస్ చంద్రచూడ్ కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2022 డిసెంబర్ 17న CJIగా
బాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.