భారత్ న్యూస్ విజయవాడ…గూగుల్ కి చీఫ్ టెక్నాలజిస్ట్ భారతీయుడు

గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్ గా భారతీయుడు ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. గత 12
సంవత్సరాలుగా కంపెనీకి సేవలందిస్తున్న రాఘవన్ గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి వాటికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు
నిర్వహించారు.

1981లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీని పొందిన ప్రభాకర్ 2012లో గూగుల్ లో చేరారు.