హిందీ గెస్ట్ లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ
పాకాల( భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ సబ్జెక్టుకు గెస్ట్ లెక్చరర్ ఉద్యోగానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఎ మోహిద్దీన్ భాషా తెలిపారు. ఈనెల 26వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ జిరాక్స్ పత్రాలు తీసుకొని హాజరు కావాలన్నారు. హిందీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% మార్కులు ఉన్నవాళ్లు అర్హులన్నారు నెట్ సెట్ పి. హెచ్.డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.