..భారత్ న్యూస్ అమరావతి,,శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. అమెరికాలోని వివిధరంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించేందుకు సిఎం చంద్రబాబునాయుడు, ఐటి మంత్రి లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో కాన్సిలేట్ జనరల్ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.