పిల్లలలో నైతిక విలువలు పెంచడి విద్యాశాఖ అధికారి బాబ్జి
పాకాల (భరత్ న్యూస్ )ఈరోజు పాకాల మండల విద్యాశాఖ అధికారి శ్రీ బాబ్జి గారు ఎన్విఎన్ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మంచి సమాజ నిర్మా ణం కోసం పిల్లలలో నైతిక విలువలు పెంచడం గురించి, వారి ఆలోచన విధానాలలో మార్పు తీసుకురావడం గురించి, వారి విద్యా స్థాయిలను పెంపొందించడం కోసం తీసుకోవలసిన చర్యల గురించి సవివరంగా తెలియజేశారు. అలాగే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో మన మండలం కూడా ఉన్నందున మండలంలోని ఉపాధ్యాయులందరూ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. పాఠశాల సమీపంలో ఉన్న నీటి గుంటలు, కరెంటు వైర్లు, చెట్ల కొమ్మలు, మధ్యాహ్న భోజన నిర్వహణ, పిల్లలు బడికి వచ్చి పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు… వీటి గురించి పిల్లలకు తగు సూచనలు అందించాలని…ఎటువంటి ఇబ్బంది లేకుండా మన విద్యుధ్ధర్మాన్ని నిర్వహించాలని తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.