నగర పరిశుభ్రత – పచ్చదనం పెంపొందించడం మీ చేతుల్లోనే ఉంది – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం – కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి (భారత్ న్యూస్ ) నగరంలో పారిశుధ్యం పెంపొందించి, పచ్చదనం పెంచడంలో పారిశుద్ధ కార్మికుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని విధాల కృషి చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. బుధవారం స్థానిక కచ్చిపి ఆడిటోరియంలో స్వచ్ఛ దివాళి – శుభ దివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్యలు పాల్గొని పారిశుద్ధ కార్మికులకు పిపిఈకిట్లు, రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ దీపావళి పండుగను నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వారందరూ కూడా తిరుపతి నగరంలో పారిశుద్ధ్యన్ని పరిశీలిస్తూ ఉంటారని అన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు చక్కగా పనిచేస్తూనే తిరుపతి పవిత్రత పరిశుభ్రత బాగుంటాయన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఐఓసీఎల్ కంపెనీతో తీపి కిట్లు పంపిణీ చేస్తున్నమన్నారు. మీకు అన్ని విధాలా సహకరిస్తామని మీరు నగరంలో పరిశుభ్రత, పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మనం అందరూ వసుదైక కుటుంబంగా పనిచేస్తేనే నగర శుభ్రంగా ఉంటుందని అన్నారు. ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయడం ఒక ఛాలెంజ్ లాంటిది. దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రతి పారిశుధ్య కార్మికులకి అభినందనలు అన్నారు. మీ రక్షణ మా బాధ్యత అని మీరు ఆరోగ్యంగా ఉండటం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నమని అన్నారు. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సారి మీకు బట్టలు, నూనె తదితరాలతో పాటు ప్రత్యేకంగా పిపిఈ కిట్లు అందిస్తున్నామని అన్నారు. మీ అందరి ఆరోగ్యం కోసం సురేష్ కూడా చేస్తున్నామన్నారు ఇప్పుడు పీఎం జీవన్ జ్యోతి, పీఎం జీవన సురక్ష, అటల్ పెన్షన్ వంటి ప్రత్యేక పథకాల ద్వారా మీకు ఆపద ఏర్పడినప్పుడు మీకు సహాయం చేయడం జరుగుతుందన్నారు. వృత్తిపరంగా మీకే సమస్యలు ఉన్న మీ హెల్త్ ఆఫీసర్ ఐనా, నన్ను కలసి తెలిపితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. మీకు పెన్షన్, పి.ఎఫ్ వంటివి సక్రమంగా జమ అయ్యేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.లు మధుబాబు, రమణ, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, హోటల్ యాజమాన్య సంఘం నాయకులు అంజి, సత్య, తదితరులు పాల్గొన్నారు.