..భారత్ న్యూస్ అమరావతి..సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ఉండవల్లిలోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలను సిఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశామని సీఎంకి వివరించారు.